ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధానిని ముక్కలు చేసిన ఘనత జగన్ కే దక్కింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 13, 2024, 09:45 PM

జగన్‌ అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నాడు ప్రత్తిపాడులో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లపాటు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి చెప్పేవన్ని అబద్ధాలు.. చేసేవన్ని మోసాలేనని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలు వన్‌సైడ్‌గానే జరుగుతాయన్నారు. తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మీ భవిష్యత్‌కు మాది భరోసా అని హామీ ఇచ్చారు. కోట్లు ఖర్చు పెట్టినా... జగన్‌ గుంటూరు సభ అట్టర్‌ ఫ్లాప్‌ అని ఎద్దేవా చేశారు. జగన్‌ బయల్దేరితే చాలు.. ఆ రోడ్డులో చెట్లన్నీ నరికేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజలపై కక్ష తీర్చుకునేందుకే జగన్‌ సీఎం అయినట్లు ఉందన్నారు. ఈ రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం తెస్తామని మాటిచ్చారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com