ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

national |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 12:57 PM

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. హల్దీ ప్రాంతంలోని సుగర్ ఛప్రా మలుపు వద్ద అదుపుతప్పిన పికప్ వ్యాన్‌ రెండు కమాండర్ జీపులను ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com