ట్రెండింగ్
Epaper    English    தமிழ்

11.02.2024 నుండి 17.02.2024 వరకూ ద్వాదశ రాశి ఫలాలు

Astrology |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 11:45 AM

1) మేషరాశి.... (అశ్విని, భరణి,  కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)
వారం ప్రారంభంలో విద్యార్థులు చాలా శ్రమ పడతారు. జ్ఞాపకశక్తి పెంచుకోవాలి. చిన్న నాటి మిత్రులను కలుస్తారు. విద్యాపరమైన అంశాలలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని విషయాలలో శ్రమకు తగిన ఫలితాలు వస్తుంది. భాగస్వామికి ఆధ్యాత్మికపరమైన అంశాలలో, సాంఘిక పరమైన విషయాలలో అభివృద్ధి ఉంటుంది. స్త్రీలకు ఆదాయం అభివృద్ధి కరంగా ఉంటుంది. సంతానమునకు వృత్తిపరమైన అవకాశాలు, ఉన్నత అధికారుల సహాయ సహకారాలు కొంత ప్రయత్నం మీద కష్టంగా అందుతాయి. భూ సంబంధిత వారసత్వ అంశాలలో  సోదర వర్గంతో సమావేశాలు, వారం మధ్యలో గవర్నమెంట్ సంబంధిత విషయాలలో రావలసిన లాభాలు కొంత ఆలస్యం ఆటంకం. వృత్తిపరంగా అధికారంలో ఉండే స్త్రీల సహకారాలు పొందుతారు. ఆకస్మికమైన ఖర్చులు  అధికంగా ఉంటాయి. వారం చివరిలో మనసులోని కోరికలు నెరవేరడం, స్థిరాసుల మీద ఆదాయం అందుకోవడం జరుగుతుంది. మంచి ఫలితాల కొరకు అమ్మవారి ఆలయ సందర్శన మంచిది.
2) వృషభరాశి...(కృతిక 2,3,4 పాదాలు, రోహిణి,మృగశిర 1,2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  
వారం ప్రారంభంలో వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది మిత్రులు,  తోబుట్టు ల   సహకారంతో కష్టం మీద పనులు నెరవేర్చుకుంటారు. విద్యార్థులు అధిక శ్రమతో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది. అలంకరణ వస్తువులు కొంటారు. వారం మధ్యలో కుటుంబంలోని స్త్రీల సహకారం పొందుతారు. ఉన్నత అధికారుల సాయం కొరకు చేయు ప్రయత్నాలలో ఆలస్యం ఆటంకం ఇబ్బంది కలిగిస్తుంది వారం మధ్యలో భాగస్వామితో అపార్ధాలు రాకుండా జాగ్రత్త వహించాలి. దూర ప్రదేశాలలో ఉండే చిన్ననాటి మిత్రుల సహకారం బాగుంటుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ ఉపాధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వారము చివరిలో ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ఖర్చు అధికముగా చేస్తారు. ఫలితముల కొరకు హనుమాన్ చాలీసా పారాయణం మంచిది.
3) మిధున రాశి...(మృగశిర 3,4  పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  
వారం ప్రారంభంలో విశ్రాంతి లేని పనుల వల్ల వాటి ఫలితాల వలన కొంత అసంతృప్తి ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కుటుంబ పెద్దల సహకారాన్ని ఆశిస్తారు. భాగస్వామితో, సంతానముతో అపార్థములు రాకుండా ఆలోచించి మాట్లాడాలి. ఉపాసనాపరమైన అంశాలలో కొన్ని అవరోధాలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు కొంత చికాకును కలిగిస్తాయి. వారం మధ్యలో కమ్యూనికేషన్ విషయాలలో  ఆత్మీయుల మధ్య కొన్ని రకాలైన చికాకులు ఇబ్బంది పడతాయి. ముఖ్యమైన విషయాలకి మధ్యవర్తిత్వం మంచిది కాదు. వారం చివరిలో వృత్తిపరంగా రావలసిన ఆదాయాన్ని అందుకుంటారు, నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. సంతానం కొరకు, బహుమాన రూపంలో ఖర్చులు అధికంగా చేస్తారు. భాగస్వామికి ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది. మంచి ఫలితాల కొరకు కృష్ణ మందిరాలు దర్శించుట మేలు.
4) కర్కాటక రాశి...(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
వారం ప్రారంభంలో ఆరోగ్య విషయాలు తీసుకోవాలి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ప్రతి విషయంలోను ఆలస్యాలు ఆటంకాలు  చికాకును కలిగిస్తాయి. సంబంధము లేని విమర్శలు మనసుని ఇబ్బంది పెడతాయి. సంఘంలో గౌరవం, వృత్తిపరమైన అభివృద్ధి, నూతన వ్యక్తుల పరిచయాలు, సంతానమునకు కొత్త అవకాశాలు ఉన్నప్పటికీ వారము మధ్యలో మీ మాటల వల్ల కుటుంబ సభ్యులలో అపార్థాలకు అవకాశము.  స్త్రీల తో ఘర్షణలు రాకుండా జాగ్రత్త పడాలి. స్థిరాస్తుల అంశాలలో రియల్ ఎస్టేట్ రంగంలో వారితో మెలకువగా వ్యవహరించాలి. పరిచయస్తులు మోసం చేసేందుకు అవకాశం ఉంది. వారము చివరిలో మానసిక ప్రశాంతత తగ్గుతుంది. వృత్తిపరంగా నూతన ప్రయత్నాలు, పెద్దల సహకారం. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఎక్కువ శ్రద్ధ. మంచి ఫలితాల కొరకు సుబ్రమణ్య స్వామి ఆరాధన మంచిది
5) సింహరాశి...(మఖ, పుబ్బ, ఉత్తర 1వ  పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
వార ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉంటారు భాగస్వామికి సంబంధించిన ఖర్చు అధికంగా ఉంటాయి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది సామాజిక సేవ చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు. విద్యార్థులకు పోటీ తత్వం పెరుగుతుంది. శ్రమకి తగిన ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్య మీద శ్రద్ధ అధికంగా ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు రుణములు చెల్లిస్తారు కొత్తరుణం కొరకు ప్రయత్నం చేస్తారు. సేవకులు సహకరిస్తారు. కుటుంబంలోని వ్యక్తులకు నూతన వృత్తిలో అవకాశాలు. సంతానానికి అభివృద్ధి. ఆత్మీయులైన మిత్రులతోనూ సోదరీ వర్గంతోనూ సమావేశాలు చర్చలు. కొత్త బహుమానాలు అందుకుంటారు. వారం మధ్యలో ఆరోగ్యమే శ్రద్ధ అవసరము, మానసిక ప్రశాంతత తగ్గుతుంది ఆకస్మిక  అనవసరమైన ప్రయాణాలు ,ముఖ్యమైన విషయాలు వాయిదా.
జీర్ణ సంబంధమైన విషయాలు చికాకును కలిగిస్తాయి. అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించటమేలు. భాగస్వామితో విభేదాలు రాకుండా ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఉంది చిన్న చిన్న విషయాలకి ఉద్వేగాలకు కోపతాపాలకు వెళ్లకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వారం చివరిలో సంతానం విదేశీ విద్య ప్రయత్నాలు, పెరుగుతుంది వారికి. వృత్తిపరంగా శ్రమ బాధ్యతలు మీకు అధికంగా ఉంటాయి.  మంచి ఫలితముల కొరకు బాలాజీ మందిరాలు దర్శించుట మేలు
6) కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4  పాదాలు, హస్త  4వ పాదం, చిత్త 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: టో , పా, పి, పూ , షం , ణా, పే,పో)
వారం ప్రారంభంలో రావలసిన రుణములు అందుకుంటారు. విద్యార్థులు గట్టి శ్రమ మీద  పరీక్షలకు సిద్ధం అవుతారు. సంతానము అభివృద్ధి కరంగా ఉంటుంది. గవర్నమెంట్ వృత్తుల కొరకు పోటీ పరీక్షలకు సంతానము చేయు ప్రయత్నాలకు మీ ఆత్మీయుల సహకారం తోడ్పాటు అందిస్తారు. వారం మధ్యలో ముఖ్యముగా స్త్రీ సంతానం వృత్తిపరంగా చేసే ప్రయత్నాలలో అభివృద్ధికరంగా ఉంటుంది. ఉన్నత అధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. విదేశాల కొరకు ఆహ్వానాలని అందుకుంటారు. వారం చివరిలో భాగస్వామి మరియు తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. రీసర్చ్ చేయు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చేయి ప్రయత్నాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. మంచి ఫలితముల కొరకు శ్రీకృష్ణ మందిరాలు దర్శించడం లేదు.
7) తులారాశి...(చిత్త 3 4  పాదాలు, స్వాతి, విశాఖ 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    
వారం ప్రారంభంలో వృత్తిపరంగా శ్రమ బాధ్యత అధికంగా ఉన్నప్పటికీ తగిన గుర్తింపుని గౌరవాన్ని పొందుతారు నూతన ప్రయత్నాలు చేస్తారు. విద్యాపరమైన విషయాలలో విద్యార్థులు చాలా శ్రమ పడతారు. సమయానికి ఆహార స్వీకరణ మంచిది తగిన విశ్రాంతి అవసరము. జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకునే విషయాల్లో శ్రద్ధ వహించాలి ఉపాసన అంశాలలో కొన్ని అవరోధాలు చికాకును కలిగిస్తాయి. ఆర్థిక విషయాలలో స్థిరాస్తుల అంశాలలో  వా తావరణం కొంత చికాకుగా ఉన్నప్పటికీ, పెద్ద ల సహకారంతో దాన్ని అధిగమిస్తారు. భాగస్వామి వృత్తిపరమైన విషయాలలో కొంత అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. నూతన వాహన గృహ కొనుగోలు కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. వారం మధ్యలో రావలసిన బాకీలను వసూలు చేసుకుని ఊరట పొందుతారు. దూర ప్రదేశాలలో నూతన పదవికి అవకాశాలు వస్తాయి. సంతానము గవర్నమెంట్ వృత్తుల కొరకు గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. వారము చివరిలో ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు.గురువులను పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యమైన విషయాలలో వాయిదాలు కొంత చికాకును కలిగిస్తాయి. మంచి ఫలితాల కొరకు, దత్త మందిరాలు సందర్శించడం మంచిది.
8) వృశ్చిక రాశి...(విశాఖ  4వ పాదం, అనురాధ, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   
వారం ప్రారంభంలో గృహల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఆలస్యాలు, వాహనములకు సంబంధించిన చిన్నబాటి రిపేర్లు. స్థిరాస్తులు అంశములలో సోదరీ వర్గంతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, భాగస్వామికి ఆదాయం అభివృద్ధి, వృత్తిపరమైన విషయాలలో ఉన్నత అధికారుల సహకారం, కింద పని చేస్తే సిబ్బంది సహాయం, ఆకస్మికమైన విషయాలలో కొంత లాభం, శుభకార్యాలకు ఆహ్వానాలు, వారం మధ్యలో మిత్రులను కలుస్తారు. వృత్తిపరమైన విషయాలలో సోషల్ మీడియాలో పెట్టుబడి పెడతారు. స్త్రీల సహకారాన్ని పొందుతారు. భాగస్వామికి గుర్తింపు గౌరవం లభిస్తుంది. విదేశాలలో ఉండే వ్యక్తుల సహకారం లభిస్తుంది. వారి వ్యాపార పరంగా అభివృద్ధి. వృత్తిపరంగా నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. వారం చివరిలో సంతానపరమైన విద్యా విషయాలు మొదలైన అంశాల మీద శ్రద్ధ విద్యార్థులు గట్టిగా కృషి చేయాలి. సంతానము పోటీలో తగిన గుర్తింపును పొందుతారు. నూతన కళాశాలల్లో ప్రవేశమునకు అవకాశములు. మంచి ఫలితముల కొరకు హయగ్రీవ జపం మేలు
9) ధను రాశి...(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
వారం ప్రారంభం సంతోషంగా ఉంటుంది, మిత్రులు తోబుట్టువులు సహకరిస్తారు కమ్యూనికేషన్ బాగుంటుంది ఆత్మీయులతో కలిసి మంచి వాతావరణంలో చిన్నపాటి ప్రయాణాలు గెట్ టుగెదర్లు. మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. శారీరక శ్రద్ధ ఆకర్షణ పెరుగుతాయి. కళాకారులకు గుర్తింపు. వారం మధ్యలో విద్యార్థులు విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. కుటుంబ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. వృత్తిపరమైన , భూ సంబంధ అంశములలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. వాదనలకు దూరంగా ఉండాలి. పోటీ తత్వం  ధైర్యసాహసాలు పెరుగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ డియేటర్స్ని తొందరపడి నమ్మరాదు. వారము చివరిలో ఆధ్యాత్మిక ఆలోచనలు ఉపాసన బలం పెరుగుతాయి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కోసం ఆలోచనలు చేస్తారు.
ఆత్మీయులు మీ సలహా  కొరకు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు చేయి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ చూపించాలి. మంచి ఫలితముల కొరకు శివాలయం సందర్శించటం మేలు
10) మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4  పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భో , జా , జి, ఖి,ఖు, ఖే, ఖో, గా, గి)
వారం ప్రారంభంలో మాటల వల్ల అపార్ధాలు రాకుండా జాగ్రత్త వహించాలి రావలసినదనం సమయానికి అందడంలో కొంత ఆలస్యం ఆటంకం నిరాశను కలిగిస్తుంది కోపాన్ని నియంత్రించుకోవాలి. వృత్తిపరంగా ఉన్నతాధికారులతో వాగ్వాదాలకు లోను కాకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. వృత్తిపరంగా అధిక శ్రమ బాధ్యతలు పెరగడం వల్ల సమయానికి ఆహార స్వీకరణ విశ్రాంతి విషయాల్లో శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో సామరస్యంగా పనులను వ్యక్తుల సహకారంతో సమస్యలను పరిష్కరించుకుంటూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళతారు. భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. విదేశీ ఆదాయాన్ని, బాగస్వామి తరపున విదేశాలలో ఉన్న ఆత్మీయుల సహాయాన్ని సమయానికి పొందగలుగుతారు. స్థిరాస్తుల  పెట్టుబడుల విషయాలలో కుటుంబములోని పెద్దలను గురువులను సంప్రదిస్తారు. వాహనములు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారం చివరిలో భాగస్వామికి ఆర్థిక విషయాలలో అనుకూలంగా ఉంటుంది సంతానము అభివృద్ధి కరంగా ఉంటారు విద్యార్థులకు అనుకూలమైన సమయం గా ఉంటుంది. మంచి ఫలితముల కొరకు గణేశ ఆరాధన మంచిది.
11) కుంభ రాశి...(ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    
వారం ప్రారంభంలో మనసుకు కొంత ఆహ్లాదకరంగా ఉంటుంది, విందు వినదాల్లో పాల్గొంటారు నూ తన ప్రణాళికల కొరకు ఆలోచనలు చేస్తారు. తల్లితండ్రుల సహకారం లభిస్తుంది నూతన పెట్టుబడుల కొరకు  గృహ వాహన మార్పుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఇచ్చిన రుణములు తిరిగి రావడం కొంత కష్టం. బాగ స్వామికి వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ నూతన బాధ్యతలు. అధికారుల సహకారంలో ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత నిరాశ ఎదురవుతుంది. సంతానము ఎక్కువ శ్రమతో ఆశించిన ఫలితములు, విద్యార్థులకు ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువుల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రయత్నం చేయు విద్యార్థులు శ్రమ అధికం చేస్తారు. నూతన కళాశాలలలో ప్రవేశం కొరకు చేయి ప్రయత్నాలు కొంతవరకు నెరవేరుతాయి. కుటుంబంలోని వారి విజయం కొంత ఆనందాన్నిస్తుంది.దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తుల సహాయ సహకారములతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఫలితముల కొరకఅమ్మవారి దేవాలయ సందర్శన మంచిది.
12) మీన రాశి...(పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) (నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
వారం ప్రారంభంలో రావలసిన లాభాలు ఆదాయం అందడంలో కొంత ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ సంతానం కొరకు అధిక ఖర్చులు చేస్తారు. వృత్తిపరమైన విషయాలు వ్యాపారలవాదేవిలు కుటుంబ,గృహ, వాహన, భాగస్వామ్య అంశాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో అధికారంలో ఉండే వ్యక్తుల సహకారం కొంత నిరాశ కల్పించినప్పటికీ వారం మధ్యలో అనుకూలతే సిద్ధిస్తుంది. సంఘంలో గౌరవము మర్యాద కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానమునకు అభివృద్ధి విదేశీ అవకాశాలు విద్యలో ముందు ఉండడం మీకు కొంత ఆనందాన్నిస్తుంది. వారం మధ్యలో లకు కళాకారులకు అనుకూలమైన సమయం. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి గవర్నమెంట్ సంబంధిత టాక్స్లను చెల్లిస్తారు, ముఖ్యమైన కార్యకలాపాలలో ఉన్నత అధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వారము చివరిలో రావలసిన ధనాన్ని అందుకుంటారు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. గుర్తింపు గౌరవాన్ని పొందడంతో పాటు విదేశీ అవకాశాలు. సంతానమునకు సంబంధించిన అంశాలలో వారు కోరుకున్న విధంగా విజయ అవకాశాలు. మరిన్ని మంచి ఫలితముల కొరకు దుర్గాదేవి ఆరాధన, ఆలయ సందర్శన మంచిది
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత  జాతకము లోని దశ  అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే  రాశి   ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com