ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధోని రికార్డ్ బ్రేక్ చేసిన ఇమ్రాన్ తాహిర్

sports |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 03:36 PM

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా భారత మాజీ కెప్టెన్ ధోని రికార్డును అధిగమించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో గయానా అమెజాన్ వారియర్స్ జట్టుకు నాయకత్వం వహించడమే కాకుండా ఫైనల్లో ఆ జట్టును గెలిపించాడు. దీంతో అత్యంత ఎక్కువ వయసులో టీ 20 ట్రోఫీని అందించిన కెప్టెన్ గా తాహిర్ రికార్డు సృష్టించాడు. ధోని 41 ఏళ్ల వయసులో టీ 20 ట్రోఫీ గెలుచుకోగా.. తాహిర్ 44 ఏళ్ల వయసులో ఈ రికార్డు తిరగ రాసాడు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com