జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలోని నిడుజివ్విలో ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందించే విధంగా సీఎం జగన్ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని దీనివల్ల ప్రతి. పథకం ఇంటి ముంగిటికే చేరుతున్నాయని తెలిపారు.