సెప్టెంబర్ 30వ తారీకు నుంచి అక్టోబర్ 8వ తారీకు వరకు సౌత్ ఆఫ్రికాలో జరగబోయే అంతర్జాతీయ టెన్నికాయిడ్ ఛాంపియన్షిప్ కు చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కే ఎల్ పురం గ్రామానికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న రెడ్డి మౌనిక ఎంపికయ్యారు. ఎంపికైన సందర్భంగా గురువారం చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ని మర్యాదపూర్వకంగా రెడ్డి మౌనిక కలిసారు. సౌత్ ఆఫ్రికా వెళ్లేందుకు రవాణా మరియు వసతి సౌకర్యం కొరకు ఆర్థిక సాయం కోరుతూ వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను తగిన ప్రోత్సాహం అందిస్తానని భరోసాని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మీసాల విశ్వేశ్వర రావు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంత్, వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, పిడి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.