ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగిన మత్తులో పిల్లలపైకి కారు తోలిన డ్రైవర్...ఓ చిన్నారి మరణం

national |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:24 AM

మద్యం మత్తులో డ్రైవింగ్ తన ప్రాణాలకు కాదు ఎదుటివారి ప్రాణాలను సైతం హరిస్తాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేుకొంది. ఆ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలి అయింది. పానీపూరి తినడానికి బయటకు వచ్చిన పిల్లలు... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మద్య మత్తులో కారు డ్రైవింగ్ చేయడంతో... పిల్లలపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి ప్రాణం కోల్పోయింది. నోయిడాలోని సెక్టార్ 45 సదాపూర్‌లో రియా, అను, అంకిత అనే ముగ్గురు అక్కచెల్లెల్లు పానీపూరి తినడానికి బయటకొచ్చారు.


ముగ్గురు సరదాగా రోడ్డు పక్కన ఉన్న ఓ బండి దగ్గర పానీపూరి తింటున్నారు. అదే సమయంలో ఓ కారు అటువైపుగా వచ్చింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి పానీపూరీ తింటున్న ముగ్గురు చిన్నారులపైకి వెళ్లింది. దాంతో ముగ్గురు అక్కచెల్లెల్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే అక్కడున్న జనం వెంటనే ఆ పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చాలా గాయాలతో రక్తసిక్తంగా మారిపోయారు.


ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులకు వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లిన చిన్నారుల్లో రియా (6) అనే చిన్నారి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com