ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో దేశంలోనే అత్యుత్త‌మ రాష్ట్రంగా...ఏపీకి వరించిన అవార్డు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 27, 2022, 11:13 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏటా స‌త్తా చాటుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌... తాజాగా పోర్టుల నిర్మాణంలోనూ దేశంలోనే అత్యుత్త‌మ రాష్ట్రంగా నిలిచింది. ఈ మేర‌కు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించిన అవార్డును ఏపీ కైవ‌సం చేసుకుంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్య‌లో పోర్టుల‌ను నిర్మిస్తున్న కార‌ణంగానే ఈ అవార్డుకు ఏపీ ఎంపికైంది. పోర్టు ఆధారిత మౌలిక వ‌స‌తుల అభివృద్ధిలో దేశంలోనే అగ్ర‌గామిగా నిలిచిన ఏపీని టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డుకు ఎంపిక చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా మంగ‌ళ‌వారం ఢిల్లీలో ఈ అవార్డును ప్ర‌దానం చేసింది. ఏపీ త‌ర‌ఫున రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్, ఆ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి క‌రికాల వ‌ల‌వ‌న్‌, మారిటైం డిప్యూటీ సీఈఓ ర‌వీంద్ర నాథ్‌లు ఈ అవార్డును అందుకున్నారు.


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com