ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్య పరిరక్షణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 12:58 PM

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సర్పంచ్ జాలాది యానాదిరావు పేర్కొన్నారు. పొన్నూరు మండల పరిధిలోని మామిళ్ళపల్లి గ్రామంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. కార్మికులతో కలిసి సర్పంచ్ రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ, సచివాలయం, పారిశుద్ధ్య సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com