ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగిని డ్యాన్స్ తో బంగ్లాదేశ్ కు రివర్స్ పంచ్

sports |  Suryaa Desk  | Published : Sat, Sep 03, 2022, 06:45 PM

ఎదుటి వారిని ఓడించి తాను సాధించిన విజయాలకు నాగిని డ్యాన్స్ తో బంగ్లాదేశ ఆటగాళ్లు చేసుకొనే సంబరాల తీరుకు పంచ్ ఇస్తూ శ్రీలంక ఆటగాళ్లు అదే రీతిలో సంబరాలు చేసుకొని రివర్స్ పంచ్ ఇచ్చారు. ఆసియా కప్ లో శ్రీలంక సూపర్ 4 దశకు చేరుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో బంగ్లాదేశ్ ను ఓడించిన శ్రీలంక ముందంజ వేసింది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిన బంగ్లాదేశ్ ఇంటిదారి పట్టింది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత చమిక కరుణరత్నే నాగిని డ్యాన్స్‌ చేశాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే లంక డ్రెస్సింగ్ రూమ్ లో అతను నాగిని డ్యాన్స్ చేయడం కెమెరాలో రికార్డైంది.


ఒక రకంగా కరుణరత్నే ఈ డ్యాన్స్ తో బంగ్లాదేశ్ ను ఆటపట్టించాడు. ఎందుకంటే కొన్నేళ్లుగా బంగ్లా ఆటగాళ్లు, అభిమానులు నాగిని డ్యాన్స్ తో తమ విజయాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే, ఇది వాళ్ల విజయానందం కంటే అవతలి జట్లను ఎద్దేవా చేసినట్లు ఉంటుంది. దాంతో, లంక ఆటగాడు కరుణరత్నే బంగ్లాదేశ్ శైలిలోనే ఆ జట్టుపై పగ తీర్చుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com