కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకం కింద నిర్మిస్తున్న ఈ ఫోర్ లైన్ రోడ్డు కోసం భూసేకరణ పూర్తి కాగా.. రహదారి నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది.
ఈ నేషనల్ హైవే-563(ఎన్‌హెచ్-563) ని వీలైనంత త్వరలో పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకువస్తే.. కరీంనగర్, వరంగల్ మధ్య ప్రయాణించేవారికి ప్రయాణ బాధలు తప్పుతాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.