రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ శర్మ గురువారం సూర్యపేట జిల్లాకు హాజరు కానున్న నైపధ్యంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిలు హైదరాబాద్ లోని రాజ్ భవాన్ లో బుధవారం భేటి అయ్యారు. పుష్పగుచ్చాలు అందజేసి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లాకు హాజరు అవుతున్న సందర్బంగా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.