ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్‌సీఏ వివాదాలపై సుప్రీంకోర్టులో విచారణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 07:16 PM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌‌‌లో వివాదాలు సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ పాలనా సిఫార్సులకు సంబంధించి ఎక్కువ మంది మెంబర్లు కుటుంబ సభ్యులేనని సుప్రీంకోర్టు నియమించి జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు బయటపెట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ సిఫార్సును వ్యతిరేకిస్తూ హెచ్‌సీఏ సభ్యులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధ‌వారం విచారణ జరిగింది. ఈ కేసు తదుపరి విచారణను రేపు (గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ బెంచ్ నిర్ణయించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com