ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవన్ రెడ్డి వంటి నేతనే ఫిరాయింపులు పార్టీ వ్యతిరేకమని చెప్పారన్న కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 04:06 PM

రేవంత్ రెడ్డి గారూ... మీ సొంత పార్టీ సీనియర్ నేతనే ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమని చెబుతున్నారు... ఇప్పటికైనా మీరు లెంపలు వేసుకుంటారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.జీవన్ రెడ్డిలాంటి సీనియర్ నాయకుడే ఇది (ఫిరాయింపులు) కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని చెబుతున్నారని తెలిపారు. మీ దిగజారుడు రాజకీయాలపై ఆయన దుమ్మెత్తి పోశారని వెల్లడించారు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పునుఒప్పుకుంటారా? క్షమాపణ చెబుతారా? అని నిలదీశారు. మీరు గడప గడపకు వెళ్లి... చేర్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్టప్రకారం వేటు వేయల్సిందేనని ఆయన కూడా పట్టుబడుతున్నట్లు పేర్కొన్నారు.ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా? ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని? ఫిరాయించిన ఎమ్మెల్యేలనా? ప్రోత్సహించిన మిమ్మల్నా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని జీవన్ రెడ్డి సొంత పార్టీని డిమాండ్ చేశారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com