ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. కానీ..’

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 02:21 PM

ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తెలిపారు. ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం వచ్చేంత వరకు వేచి చూడాలన్నారు.
అలాగే గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకున్నప్పుడు హైకోర్టు ఇలాగే వ్యవహరించి ఉంటే బాగుండేదన్నారు. తెలంగాణలో ఈ పరిస్థితి రావడానికి కేసీఆర్‌ కూడా కారణమన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com