విద్యార్థుల పరిస్థితి చూస్తే బాధేస్తుంది.. విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మీరు వెళ్లిపోయాక మమ్మల్ని మళ్ళీ కొడతారు అంటూ భయపడుతున్నారు.పిల్లలను కర్రలు విరిగిపోయేలా కొడుతున్నారు.అన్నంలో, పప్పులో పురుగులు వస్తున్నాయి అంటే తీసి తినమని కొడుతున్నారు అని చెప్తున్నారు.పాఠాలు సరిగ్గా చెప్పడం లేదు, గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమని చెప్తున్నారు,అటు విద్య లేదు ఇటు సరైన భోజనం లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి విద్యార్థులు బాధపడుతున్నారు.ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు రెండో జత ఇప్పటివరకు ఇవ్వలేదని, బుక్స్ కూడా ఇవ్వలేదని 6వ తరగతి విద్యార్థులు చెప్తున్నారు