నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వివరాల గురించి సోమవారం రాత్రి 11 గంటల నుండి అర్ధరాత్రి 2. 30 గంటల వరకు తన వ్యక్తిగత సహాయకునితో కలిసి పూర్తి డేటాను ఎమ్మెల్యే వేముల వీరేశం సేకరించారు. అసెంబ్లీలో సంబంధిత శాఖల మంత్రులతో చర్చించవలసిన అంశాలపై నివేదిక రూపొందించారు. ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామన్నారు.