నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. మంగళవారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను, 514. 60 అడుగులు, పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టిఎంసిలకుగాను 139. 6134 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో 1, 41, 600 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2, 974 క్యూసెకులు ఉంది.