భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మిషన్ పరివర్తన అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ. మాదక ద్రవ్యాలకు అలవాటుపడితే శారీరక, మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, వాటిని పకడ్బందీగా అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు, సరిత పాల్గొన్నారు.