మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి చౌక్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ సంతోష్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గద్వాల పురవీధుల గుండా పాత బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఎస్పీ తోట శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సరిత, అధికారులు, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు.