ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను డిండి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. బుధవారం డిండి ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం వంగూరు మండలం నుండి ట్రాక్టర్ లో అక్రమంగా తవక్లాపూర్ కు ఇసుకను తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.