జగిత్యాల అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆయన చేరికతో జీవన్ రెడ్డి కొంత మనస్తాపానికి గురయ్యారని అన్నారు. ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటామని పార్టీ హైకమాండ్ ఆయనకు హామీ ఇచ్చిందని తెలిపారు. రుణమాఫీ, రైతుభరోసా విషయంలో జీవన్ రెడ్డి సలహాలు తీసుకుంటామని చెప్పారు.