జడ్చర్ల పట్టణంలోని 33/11 కె. వి సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం చెట్ల తొలగింపు కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఓల్డ్ బజార్, పద్మావతి కాలనీ, క్లబ్ రోడ్డు ఎన్ఐసి ఆఫీసు రోడ్డు, మటన్ మార్కెట్, విద్యానగర్, కల్వకుర్తి రోడ్డు, సిగ్నల్ గడ్డ, కల్వకుర్తి రోడ్డు, నేతాజీ చౌక్, గౌరీ శంకర్ కాలనీ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.