ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ రూట్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. అక్కడ భారీ ఫ్లైఓవర్ నిర్మాణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 21, 2024, 07:57 PM

అత్యంత కీలకమైన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భారీ ఫ్లైఓవర్‌ నిర్మాణం జరగనుంది. ఎమ్మార్వో ఆఫీసు నుంచి పద్మావతి ఫంక్షన్‌ హాల్‌ వరకు 2 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ ఫ్లైఓవర్ కోసం మొత్తం రూ.82 కోట్లు ఖర్చువుతుందని అంచనా. పైవంతెన నిర్మించే ప్రదేశం గట్టిదనం పరంగా అనుకూలంగా ఉందని నిర్దారణ కావడంతో పనులు కూడా వేగంగా జరిగేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.


ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఇరువైపులా జాతీయ రహదారుల సంస్థ అధికారులు సర్వీస్‌ రోడ్ల నిర్మాణం, మరమ్మతులను చేపట్టారు. ముందుగా వలిగొండ అడ్డ రోడ్డు నుంచి పద్మావతి ఫంక్షన్‌హాల్‌ వరకు 500 మీటర్ల మేర పనులు సాగుతుండగా.. ఇవి మరో వారం, పది రోజుల్లో పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఒకవైపు పూర్తయిన తర్వాత రెండోవైపు చేపడతామని తెలిపారు. ఇక, ఫ్లైఓవర్‌ నిర్మాణ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న హరియాణాకు చెందిన రాంకుమార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ రెండు వారాల్లో పనులు ప్రారంభించే అవకాశం ఉంది.


విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతోన్న ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచే చొరవ తీసుకున్నారు. ఆయన అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేసి, నిధులు మంజూరు చేయించారు. ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాల (బ్లాక్‌ స్పాట్‌)లను గుర్తించి నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం నిధులు మంజూరు చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com