కొంత మందికి పదవులు వస్తే అదృష్టం వచ్చింది అనుకుంటాం కానీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం దురదృష్టవంతుడేనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డికి ఎన్ని పదువులు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చెయ్యలేదని దుయ్యబట్టారు. గత ఏదేళ్లలో కిషన్ రెడ్డి చేసింది ఏమైనా ఉందంటే అక్కడేక్కడో రైల్వే స్టేషన్‌లో పాత లిఫ్టును బాగు చేసి ప్రారంభించడమేనని ఎద్దేవా చేశారు. ఈసారి కేబినెట్ పదవి తీసుకొని హైదరాబాద్ వచ్చిన మొదటి రోజే తెలంగాణకు ద్రోహం చేసే పని మొదలుపెట్టారంటూ జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.
సింగరేణిని నట్టేట ముంచి దానికి ఉరి పెట్టే పని చేశాడంటూ కిషన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. బొగ్గు గనులు వేలం వేయడమంటే సింగరేణికి ఉరి వేయడమేనని జగదీశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయెజనాల పట్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సోయి లేకుండా పోయిందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఏకాభిప్రాయంతోనే సింగరేణి ప్రైవేటీకరణకు ఆ 2 పార్టీలు తేరలేపాయని ఆరోపించారు. నిన్నటి వరకు కలిసి వేలం పాటను నిర్వహిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం, కేటీఆర్ హెచ్చరికతో ఇవాళ మాట మార్చాడన్నారు. ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమాత్రం అవగాహన లేదంటూ జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.