జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ ప్రాధమిక పాఠశాలలోని విద్యార్థులకు శుక్రవారం శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 6 నోటుబుక్స్ చొప్పున వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయురాలు హేమలత, ఉపాధ్యాయులు రజిత, తేజస్విని, శ్రావణి, స్వరూప, శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యులు ఓగుల అజయ్, సిరిపురం రాకేష్, ముజాయిద్, సిరిపురం నవీన్, పొన్నం చరణ్, గ్రామస్థులు పాల్గొన్నారు.