నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్లగొండ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున గురువారం ఒక సెట్ నామినేషన్ పత్రాలను బిజెపి నాయకులు బండారు ప్రసాద్ శ్రీనివాస్ గౌడ్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరికి అందజేశారు. ఈ సందర్భంగా పండగ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈనెల 21న మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు, నల్లగొండ పార్లమెంట్ బిజెపి కైవసం చేసుకుంటుందని తెలిపారు.