నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు బుధవారం ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. అనంతరం ఎదురుకోలు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.