పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సిహెచ్. సింధుశర్మ పేర్కొన్నారు. పౌరులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. జిల్లా పరిధిలోని 913 పోలింగ్ కేంద్రాలను 578 లొకేషన్ లో ఏర్పాటు చేశారు. భద్రత చర్యలు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసి పోలీసులతో పాటు సిఏఎఫ్ సిబ్బందిని నియమించారు.