ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో మున్సిపాలిటీ సిబ్బంది రాకపోవడంతో డ్రైనేజీ కాలువలలో చెత్తాచెదారం పేరుకుపోయి మరుగు నీరు అంతా రోడ్లపై వస్తుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. దీంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి విషయంపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.