ఎంతో మంది ప్రాణ త్యాగంతో భారతదేశంలో తెలంగాణ ప్రాంతం కలిసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. నెహ్రూ, పటేల్ వల్లే ప్రస్తుత భారతదేశం సాధ్యమైందని అన్నారు. 1956లో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందని వ్యాఖ్యానించారు. అప్పటి పాలకుల వివక్ష కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైందని తెలిపారు. దానికి తాను సారథ్యం వహించడంతో జన్మ ధన్యమైందని అన్నారు.