సర్ధార్ వల్లబాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో ద్వారా నిజాం పాలకుల నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. అయితే దీనిపై కూడా కొందరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు కోసం అమరుల త్యాగాలను మూలన పడేశారని విమర్శించారు. ఇలాంటి చర్యలను ప్రజలు క్షమించరని హెచ్చరించారు.