తెలంగాణ విమోచన దినోత్సవం, జాతీయ సమైక్యత వేడుకల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సికింద్రాబాద్, పరేడ్‌గ్రౌండ్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్‌బాబు తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే బారికేడింగ్ పాయింట్ల నుంచి అనుమతిస్తామని ఆయన తెలిపారు.