యువతి ఫొటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన గుడిసె డాన్ (37) హైదరాబాద్ కాప్రా మండలం జవహర్నగర్ కి చెందిన ఓ యువతి ఫేస్బుక్ , ఇన్స్ట ఖాతాలు ప్రారంభించి ఆమె ఫొటోలు అసభ్యంగా మార్చి పోస్ట్ చేసాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సాంకేతిక సమాచారం ఆధారంగా పట్టుకొని అరెస్ట్ చేశారు.