హైదరాబాద్ లో ఆదివారం బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్ట్, ఎంఐఎం పార్టీల సభలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల నీడలో నగరం ఉంది. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేంద్రమంత్రి అమిత్ షా పరేడ్ షా గ్రౌండ్స్‌లోని తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొననుండటంతో అక్కడ సిఆర్పిఎఫ్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.