రాచకొండ సరూర్ నగర్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్ ఓ టి పోలీసులు కలిసి ఫేక్ సర్టిఫికెట్ల ముఠా కేసును శనివారం చేదించారు. ఈ మేరకు మొత్తానికి బీటెక్, ఎంఎస్సీ, బిఎస్సీ కోర్సుల దొంగ సర్టిఫికెట్లు మొత్తం 64 దొంగ సర్టిఫికెట్లను అధికారులు సీజ్ చేశారు. మరోవైపు ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. గుజరాత్, కర్ణాటక, మణిపూర్ విద్యా సంస్థల సర్టిఫికెట్లు ఉన్నాయి.