నాంపల్లి మండలం చిట్టెంపహాడ్ గ్రామ మాజీ సర్పంచ్ బుసిపాక సంజీవ్ పై అదే గ్రామానికి చెందిన రవి శనివారం గొడ్డలితో దాడి చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామంలో మాజీ సర్పంచ్ సంజీవ్ అదే గ్రామానికి చెందిన ముమ్మడి రవిల మధ్య భూతగాదాలు ఉన్నాయి. శనివారం కూడా ఇదే విషయం పై గొడవ జరగడంతో రవి సంజీవ్ పై గొడ్డలితో దాడి చేశాడు. సంజీవ్ కు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యలు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.