నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలోని హైవే జంక్షన్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా కానిస్టేబుల్ ఏర్పాటు చేయాలని చిట్యాల ఎస్సై ఇరుగు రవి కి పట్టణ ప్రజల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని శనివారం సీ ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్ యాదవ్, సిపిఎం ఆధ్వర్యంలో అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంక్షన్లో నిత్యం ప్రమాదాలు జరగడం మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.