నల్లగొండ జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన నలపరాజు నర్సింహకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1 లక్ష రూపాయల ఎల్వోసీ పత్రాన్ని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేసినట్టుగా శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.