ఉమ్మడి పాలమూరు జిల్లా కరువు కరాళ నృత్యం చేసిన నేలలో 'పాలమూరు-రంగారెడ్డి' ప్రాజెక్టు ప్రారంభంతో శనివారం కృష్ణమ్మ జలతాండవం చేయబోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వలసల నేలపై ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతమవుతోంది. నిన్నపరాయి నేలపై ప్రాజెక్టులకు రాళ్లెత్తిన పాలమూరు లేబర్ నేడు సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్నారని అన్నారు.