రాష్ట్రంలో అభివద్ధి పండుగ జరుగుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బీసీ బంధు, మైనార్టీ బంధు లబ్ధిదారులకు మంత్రి హరీశ్ రావు శనివారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు.