హైదరాబాద్లో మరోసారి ఎన్ఐఎ సోదాలను ముమ్మరం చేసింది. శనివారం పాతబస్తీ, టోలీచౌకీ, మలక్పేట్ సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఐఎస్ఐఎస్ సానుభూతి పరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. వివిధ గ్రూపులుగా ఏర్పడి కొందరు ఉగ్ర కుట్రకు తెరలేపారని ఎన్ఐఎ అనుమానిస్తోంది. మరోవైపు తమిళనాడులో 10 చోట్ల సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం.