ఖమ్మం నగరంలోని 11, 47వ డివిజన్ లో రూ. 2 కోట్లతో సీసీ డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి కేసీఅర్ ఇచ్చిన ఎస్డీఎఫ్ నిధులు రూ. 50 కోట్లు కేవలం సైడ్ డ్రెయిన్లు, సీసీ రోడ్ల కోసమే వినియోగించామన్నారు. మంత్రిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యాన మంత్రి కేటీఆర్ రూ. 100 కోట్లు నిధులు కేఎంసీకి ఇప్పించారని తెలిపారు.