జగిత్యాల పట్టణ నవ్య గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యార్థినిలు జూపాక మాధురి ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 466/470 మార్కులతో స్టేట్ రెండవ ర్యాంకు, బానుక దివ్య 465/470 స్టేట్ మూడవ ర్యాంకు, ద్వితీయ సంవత్సరంలో సరిగల్ల శ్రియ బైపిసి విభాగంలో 985/1000 మార్కులతో స్టేట్ 6వ ర్యాంక్ సాధించగా వారిని జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మంగళవారం పుష్ప గుచ్చo అందజేసి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీపాద నరేష్, ప్రిన్సిపల్ గాలిపెళ్ళి ఈశ్వర్, ఉపాద్యాయులు తదితరులు ఉన్నారు.