తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.