ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్ప 2 : 100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సూసేకి' సాంగ్ తెలుగు వెర్షన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 05:40 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని ది కపుల్ సాంగ్ ని సూసేకి అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యొక్క తెలుగు వెర్షన్ 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 6, 2024న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com