ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్కీ క్రానికల్స్ ఎపిసోడ్ 2: ది పొడ్కాస్ట్ విత్ అశ్వథామ ఇంటర్వ్యూ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 05:38 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం జూన్ 27, 2024న గ్రాండ్ గా విడుదల అయ్యింది. తాజాగా చిత్ర బృందం కల్కీ క్రానికల్స్ ఎపిసోడ్ 2: ది పొడ్కాస్ట్ విత్ అశ్వథామ పూర్తి ఇంటర్వ్యూని విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్నితెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, అన్నా బెన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్, మాళవిక నాయర్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com