ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తాండల్' గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 04:44 PM

కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటితో నాగ చైతన్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "తాండల్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాని మూవీ మేకర్స్ జనవరి లేదా ఫిబ్రవరి 2025లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లవ్-యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో చై మత్స్యకారునిగా కనిపించనున్నారు. ఈ చిత్రం 2018లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి స్ఫూర్తిని పొందింది. GA2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com