ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రీపోన్ అయ్యిన 'ఆపరేషన్ రావణ్' విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 04:42 PM

వెంకట సత్య దర్శకత్వంలో హీరో రక్షిత్ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఆపరేషన్ రావన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ముందుగా ఈ సినిమా ఆగష్టు 2, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకి షెడ్యూల్ చేయబడింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ని జులై 26కి ప్రీపోన్ చేసినట్లు ప్రకటించారు. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సంగీత విపిన్ కథానాయికగా నటించారు. ద్విభాషా సైకో థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, KA పాల్ రాము, విద్యా సాగర్, TV5 మూర్తి, కార్తీక్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com