ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గగనానికి ఉదయం ఒకటే' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:53 AM

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకు సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మానమై
యుగ యుగముల పయనం మానమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నా కోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే

ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకు సంద్రం ఒకటే

నీ కన్నుల్లో కళను అడుగు ఇతడు ఎవరనీ
నీ గుండెల్లో పెరిగే లయనే బదులు దొరకని
నిదురించు యవ్వనంలో పొద్దు పోడుపై
కదిలించ లేదా నేనే మేలుకొలుపై
గత జన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
పరదాల మంచుపొరలో ఉండ గలవా

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకు సంద్రం ఒకటే

నా ఊహల్లో కదిలే కడలి ఎదుట పడినవీ
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవీ
సమయాన్ని శాస్వితంగా నిలిచిపోనీ
మమతాన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
కృతి లేని ప్రేమ కధగా మిగిలిపోని

గగనానికి ఉదయం ఒక
కెరటాలకు సంద్రం ఒక
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మానమై
యుగ యుగముల పయనం మానమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే
జన్మించలేదా నీవు నా కోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే

ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com